వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం 2018

తెలంగాణ ఆర్ధికవ్యవస్థలో వ్యవసాయం అతిపెద్ద రంగం మరియు రాష్ట్రంలో దాదాపు 55% జనాభాకు వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్నది.

  1. వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉన్నా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా ఎక్కువగా ఉన్నా, రాష్ట్రము వ్యవసాయ రంగంలో అభివృద్ది సాధించగలిగింది.
  2. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆహార భద్రత, జీవన భద్రత కల్పించే విషయమై ఆలోచిస్తోంది.
  3. ప్రస్తుత పరిస్థితులలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, కుటుంబ ఖర్చులు, ప్రత్యేకించి ఆరోగ్యం మరియు విద్యపై ఖర్చులు పెరిగిపోవడం వలన రైతులకు వ్యవసాయం వలన ఆదాయం చాలా తక్కువగా వస్తుంది.
  4. 2013 సంవత్సరానికి ఎస్ ఎ ఎస్ (సిట్యుయేషన్ అసెస్మెంట్ సర్వే) ప్రకారం, పొలాల నుండి వ్యవసాయ గృహ మరియు వ్యవసాయేతర వనరుల నుండి సగటు వార్షిక ఆదాయం రూ. 77112/-, వీటిలో 60% వ్యవసాయ కార్యకలాపాల నుండి మరియు మిగిలిన 40% వ్యవసాయేతర వనరుల నుండి తీసుకోబడింది. ఇది చాలా తక్కువగా ఉంది.
  5. రైతులను అప్పుల నుండి విముక్తి కలిగించడానికి, వారి ఆదాయాన్ని పెంచడానికి మరియు వ్యవసాయ ఉత్పాదకత పెంపొందిచాలన్నా, రైతులకు పెట్టుబడి అందించడమే సరియైన మార్గము.

తెలంగాణ ప్రభుత్వం పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం కోసం 2018-19 నుండి “వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం – రైతు బంధు” అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.

పథకం యొక్క విస్తృత వివరాలు క్రింది విధంగా ఉన్నాయి

  1. రుణ భారం నుండి రైతులను ఉపశమనం చేయడం మరియు వారిని మళ్లీ రుణ ఉచ్చులో పడకుండా ఉండడానికి ఈ పధకం ప్రవేశ పెట్టింది.
  2. వ్యవసాయం మరియు ఉద్యాన పంటలకు ప్రతి ఎకరాకు @ 4000 / – రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా మరియు (1) విత్తనాలు, (2) ఎరువులు, (3) పురుగుమందులు, (4) శ్రమ మరియు ఇతర పెట్టుబడులు వంటి వాటిని రైతులు సీజన్‌కు ఎంపిక చేసుకోని వారి క్షేత్ర కార్యకలాపాలలో వాడతారు.

2019-20 నుండి రైతు బంధు కింద ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ .5000 కు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. పైన పేర్కొన్న బడ్జెట్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని రూ .15,450.00 కోట్లు 2019-20 సంవత్సరానికి 60,00,000 హె క్టార్ల కు సరిపోతుందని ప్రతిపాదించబడింది మరియు ఇ కుబీర్ ద్వారా రైతుల ఖాతాలలో జమ చేయబడుతంది.