రైతులకు విత్తన సరఫరా

ఖరీఫ్ 2019 కి గాను వివిధ పంటల(సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ మరియు ఇతర పంట లైన పచ్చి రొట్ట ఎరువు లు) 7.76 లక్షల క్వింటాల్ విత్తనాలను సబ్సిడీపై విత్తన సరఫరా నోడల్ ఏజెన్సీల ద్వారా NMOOP, RKVY, NFSM (వరి, పప్పుధాన్యాలు, మిల్లెట్లు, ఆకుపచ్చ ఎరువు) మరియు సాధారణ రాష్ట్ర ప్రణాళిక పధకాల క్రింద సరఫరా చేయబడతాయి.

Sl. No. Crop Kharif  2019 Plan TSSDC HACA NSC Total
1 సోయా బీన్ JS-335 170000 90000 50000 30000 170000
  JS-9560 20000 0 10000 10000 20000
  JS-9305 10000 10000 0 0 10000
  సోయా బీన్ మొత్తము 200000 100000 60000 40000 200000
2 వేరు సెనగ K-6 10000 7000 0 3000 10000
3 వరి 280000 280000 0 0 280000
4 కందులు 20000 20000 0 0 20000
5 పెసలు 10000 10000 0 0 10000
6 మినుములు 5000 5000 0 0 5000
7 జొన్న హైబ్రిడ్ 2000 2000 0 0 2000
8 మొక్కజొన్న 80000 80000 0 0 80000
9 ధయించ 100000 90000 10000 0 100000
10 సన్ హెంప్ 30000 30000 0 0 30000
11 పిల్లి పెసర 10000 10000 0 0 10000
12 నువ్వులు 1000 1000 0 0 1000
13 ప్రొద్దు తిరుగుడు 1000 1000 0 0 1000
14 ఆముదము 1000 1000 0 0 1000
  మొత్తము 750000 637000 70000 43000 750000

 
విత్తన సరఫరా చేసే సంస్థలైన యన్.యస్.సి , టి.యస్.యస్.డి.సి, హాకా, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ మొదలైన వాటి ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాయితీపై విత్తనాలను ప్రాధమిక సహకార సంస్థలద్వారా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు మరియు మనగ్రో మోర్ సెంటర్ల ద్వారా రైతులకు సరఫరా చేయటం జరిగింది.

రైతుల సంక్షేమం కొరకు రాయితీ విత్తనాల వివరాలను తెలంగాణ కిసాన్ పోర్టల్ లో ఆన్లైన్ సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం నందు పొందుపరచడమైనది. ఇది వెబ్ ద్వారా రూపకల్పన చేసి అభివృద్ధి పరచిన వ్యవస్థ. రాష్ట్రస్థాయిలో నివేదికలను ఆన్లైన్ సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారా ఎప్పటికపుడు పొందవచ్చును.

జిల్లాల యొక్క అవసరాల మేరకు విత్తనాన్ని కేటాయించి వాటి ద్వారా మండలాలకు మరియు మండలాల నుండి అమ్మబడే కేంద్రాలకు వివిధ రకాల పంటల విత్తనాలను రాయితీ పై కేటాయిస్తారు. ఈ విధంగా వచ్చిన విత్తన స్టాక్ వివరాలను అమ్మబడే కేంద్రంలో కంప్యూటర్లో నమోదు చేస్తారు .రైతులు తమ మండలంలోని సమీపంలో గల అమ్మబడే కేంద్రాల నుండి కావలిసిన విత్తనాలను రాయితీ పై పొందుటకు పట్టాదారు పాసు పుస్తకం మరియు ఆధార్ వివరాలను వ్యవసాయ అధికారికి అందచేస్తారు. అర్హత గల రైతుల యొక్క భూమి వివరాలను పరీశీలించి రాయితీపై విత్తన కొనుగోలుకు అనుమతి పత్రాన్నిఅందచేస్తారు .అనుమతి పత్రాన్నిరైతులు అమ్మబడే కేంద్రంలో చూపించి విత్తనాన్ని కొనుగోలుచేస్తారు.